test

మహోదయ పుణ్యకాలం

కోటిసూర్య గ్రహణములతో సమానమైనది.
పుష్య బహుళ అమావాస్య. 04/02/2019- సోమవారం మహోదయ పుణ్యకాలం.

శ్లోకం:-
అర్క శ్రోణా వ్యతీపాత యుక్తా౽మా పౌష మాఘయోః!అర్ధోదయస్స విఙ్ఞేయః కించిన్యూనా మహోదయః

అమావాస్య,సోమవారం, శ్రవణానక్షత్రం, వ్యతీపాతయోగం కలిసిన రోజున మహోదయమనే అలభ్యపుణ్యకాలం.
చాలా అరుదుగా ఈ కలయిక సంభవిస్తుంది. అందుచేతనే ఇటువంటి యోగం కోటిసూర్య గ్రహణములతో సమానమైనది అని పెద్దలు చెప్పారు.


ఈ సమయంలో సముద్రస్నానం చేసి పితృతర్పణములు చేయాలి. ఈరోజున చేసే దానములు విశేష ఫలితాన్నిస్తాయి. సాధకులకు మంత్రానుష్ఠానపరులకు చాలా ముఖ్యమైన రోజు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ మహోదయ పుణ్యకాలంలో ఈశ్వర పూజ, స్నానం, జపం, తపం ఆచరించి, వారి వారి శక్తి కొలది దానధర్మాలను ఆచరించి అనంతకోటి పుణ్యఫలాన్ని పొందగలరు. ధన్యవాదములతో.....మీ కె ఎస్ ఆర్ ఆంజనేయ శర్మ.వేద పారాయణ దార్. తిరుమల తిరుపతి దేవస్థానములు🙏🙏

Comments

Popular posts from this blog

Fri_Apr_12_16:01:16_PDT_2019

Sat_Apr_13_12:01:16_PDT_2019